13 మంది IAS అధికారుల్ని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. టి.కె.శ్రీదేవికి కీలకమైన పురపాలక శాఖ డైరెక్టర్ పదవి కట్టబెట్టింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా నారాయణరెడ్డి, నల్గొండ జిల్లా కలెక్టర్ గా ఇలా త్రిపాఠి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా హన్మంతరావు బదిలీ అయ్యారు.
టి.కె.శ్రీదేవి – డైరెక్టర్, పురపాలక శాఖ
జడ్.కె.హనుమంతు – డైరెక్టర్, టూరిజం, దేవాదాయ శాఖ(FAC)
ఎస్.హరీశ్ – I&PR ప్రత్యేక కమిషనర్, రెవెన్యూ జాయింట్ సెక్రటరీ(FAC)
నారాయణరెడ్డి – కలెక్టర్, రంగారెడ్డి జిల్లా
ఇలా త్రిపాఠి – కలెక్టర్, నల్గొండ జిల్లా
హన్మంతరావు – కలెక్టర్, యాదాద్రి భువనగిరి జిల్లా
మందా మకరందు – ప్రాజెక్టు డైరెక్టర్(CMRO-CCLA)
కె.శశాంక – కమిషనర్, స్టేట్ ఫ్లాగ్ షిప్ ప్రాజెక్ట్స్
టి.వినయ్ కృష్ణారెడ్డి – జాయింట్ సెక్రటరీ R&R ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, I&CAD
ఆయేషా మస్రత్ ఖానమ్ – జాయింట్ సెక్రటరీ, వైద్యారోగ్య శాఖ
నిఖిల్ చక్రవర్తి – ఈడీ TGIIC, అడిషనల్ కమిషనర్ CT(FAC)
కె.చంద్రశేఖర్ రెడ్డి – MD, డెయిరీ డెవలప్మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్
ఎస్.దిలీప్ కుమార్ – మున్సిపల్ కమిషనర్, నిజామాబాద్