రాష్ట్రంలో పలువురు ఉన్నతాధికారులకు పోస్టింగ్స్ ఇస్తూ CS శాంతికుమారి ఆదేశాలిచ్చారు. ఇందులో పలువురికి స్థానచలనం(Transfers) కల్పించగా.. మరికొందరికి అదనపు పోస్టింగ్స్ కట్టబెట్టారు. మొత్తం తొమ్మిది మందికి గాను ఆరుగురు ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఇంకో ఇద్దరు డిప్యూటీ కలెక్టర్లు ఉన్నారు.
అధికారుల పాత, కొత్త స్థానాలు ఇలా…
ఐఏఎస్ పేరు | పాత స్థానం | కొత్త స్థానం |
కె.సురేంద్రమోహన్ | ప్రభుత్వ కార్యదర్శి, గనులు, భూగర్భజల శాఖ | పూర్తి బాధ్యతలు |
తఫ్సీర్ ఇక్బాల్(IPS) | ప్రత్యేక కార్యదర్శి, మైనార్టీ సంక్షేమం | మైనార్టీ విద్యాసంస్థల కార్యదర్శి |
టి.వినయ్ కృష్ణారెడ్డి | జాయింట్ సెక్రటరీ, HM&FW | కమిషనర్, R&R, LA(FAC) |
ఆయేషా మస్రత్ ఖానం | మైనార్టీ విద్యాసంస్థల కార్యదర్శి | GAD(జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్) |
ఎస్.కె.యాస్మిన్ బాషా | డైరెక్టర్, హార్టికల్చర్-సెరికల్చర్ | మైనార్టీ సంక్షేమ డైరెక్టర్(FAC) |
ఎ.నిర్మల కాంతి వెస్లీ | డైరెక్టర్ WCD & SC | వీసీ, ఎండీ – తెలంగాణ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్(FAC) |
పి.శ్రీజ | అడిషనల్ కలెక్టర్(ఎల్.బి.) ములుగు | అడిషనల్ కలెక్టర్(ఎల్.బి.) ఖమ్మం |
ఎం.డి.అసదుల్లా | స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్-HMDA | CEO వక్ఫ్ బోర్డ్ |
జి.మల్సూర్ | డైరెక్టర్, ఇండస్ట్రీస్ | CMD మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(FAC) |