గతేడాదితో పోలిస్తే తెలంగాణ వృద్ధి రేటు 10.1 శాతం నమోదు కాగా తలసరి ఆదాయం 3,79,751గా బడ్జెట్లో సర్కారు ప్రకటించింది. రాబడి అంచనాలు, మొత్తం అప్పులు, కేంద్ర పన్నుల్లో వాటాను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.
ఆదాయ మార్గాలు(అంచనాలు)…
ఆదాయ మార్గం | రూ.కోట్లలో |
సొంత పన్నుల రాబడి | 1,45,419 |
పన్నేతర ఆదాయం | 31,618 |
కేంద్ర పన్నుల్లో వాటా | 29,899 |
కేంద్ర నుంచి గ్రాంట్లు | 22,782 |
అమ్మకపు పన్ను ఆదాయం | 37,463 |
ఎక్సైజ్ శాఖ ఆదాయం | 27,623 |
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం | 19,087 |
వాహనాలపై పన్నుల రూపేణా | 8,535 |
ఆర్థిక ఏడాది ముగిసేనాటికి అప్పుల అంచనా | 5,04,814 |
ప్రతిపాదించిన రుణాలు | 69,639 |