Published 18 Dec 2023
రాష్ట్రంలో ఆదాయ మార్గాలపై అన్వేషణ ప్రారంభించిన రేవంత్ సర్కారు.. కొత్త విధానాలపై దృష్టిపెట్టింది. పారిశ్రామిక రంగానికి ఊపు తెచ్చేలా నూతన పారిశ్రామిక వాడలు(Industrial Corridors) ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం మాదిరిగా ఇష్టమొచ్చినట్లుగా, ప్రజలకు నష్టం కలిగించే విధంగా ఉండకూడదంటూ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. పారిశ్రామిక రంగంపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సాగు చేసుకోవడానికి పూర్తి అనుకూలంగా లేని ప్రాంతాలు, బంజరు భూములనే ఇందుకు సేకరించాలని స్పష్టం చేశారు.
ఎయిర్ పోర్ట్, జాతీయ రహదారులకు 100 కిలోమీటర్ల పరిధిలో ఉంటే అభివృద్ధి వేగంగా జరిగే అవకాశముంటుందని రేవంత్ అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు(ORR), రీజినల్ రింగ్ రోడ్డు(RRR)కు మధ్యలో వెసులుబాటు గల ల్యాండ్స్ ను మాత్రమే లెక్కలోకి తీసుకోవాలన్న సీఎం.. ఇండస్ట్రియల్ కారిడార్ కోసం 500 నుంచి 1,000 ఎకరాలు గుర్తించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.