గురుకుల విద్యాసంస్థల్లో సౌకర్యాలు కల్పిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. MJP రెసిడెన్షియల్ స్కూల్స్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అధికారులతో BC సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష(Review) నిర్వహించారు. ప్రస్తుతమున్న రెండు COEల సంఖ్యను 10కి పెంచుతూ కొత్తగా ఎనిమిదింటిని చేర్చబోతున్నారు. తద్వారా IIT, NIT, NEETలో ఇచ్చే శిక్షణ స్థాయి పెరగనుంది. విద్యార్థులకు ఇస్తున్న రెండు యూనిఫామ్స్, ఒక స్పోర్ట్స్ డ్రెస్ తోపాటు కొత్తగా రెండు నైట్ డ్రెస్సులు ఇవ్వాలని నిర్ణయించారు.
90 ప్రాంతాల్లోని 104 గురుకులాల్లో RO ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, ప్రతి చోటా సోలార్ వాటర్ హీటర్లు, CC కెమెరాలు, హైజెనిక్ కిచెన్ ఉండేలా చూడాలన్నారు. డిగ్రీ కాలేజీల్లోని అధ్యాపకులకు సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలని, 100 రోజుల తర్వాత జరిగే భేటీలో వాటిని ఆమోదించుకోవాలని మంత్రి ఆదేశించారు. వంటగదుల పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని, వాష్ రూముల్లో రిపేర్లు చేపట్టాలంటూ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంకు ఆదేశాలిచ్చారు.