
ఎన్నికల సంఘం ఆదేశాలతో 14 మంది పోలీస్ ఇన్స్ పెక్టర్లను బదిలీ చేస్తూ(Inspectors Transfers) ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ కమిషనరేట్(Hyderabad Commissionarate) పరిధిలోని వివిధ విభాగాల్లో అధికారులకు స్థాన చలనం కల్పించారు. చాదర్ ఘాట్ PS డీఐగా ఉన్న ఏరుకొండ సీతయ్యను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ SHOగా బదిలీ చేశారు. బోరబండ పీఎస్ SHO కె.రవికుమార్ ను CCS DDగా.. సైఫాబాద్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ఎస్.రాజశేఖర్ ను సిటీ SB(స్పెషల్ బ్రాంచి)కి.. అఫ్జల్ గంజ్ DI పి.లక్ష్మీకాంత్ రెడ్డిని సైఫాబాద్ SHOగా ట్రాన్స్ ఫర్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాలిచ్చారు.
పేరు | పాత స్థానం | కొత్త స్థానం |
ఏరుకొండ సీతయ్య | చాదర్ ఘాట్ PS DI | చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ SHO |
కె.రవికుమార్ | బోరబండ పీఎస్ SHO | CCS DD |
ఎస్.రాజశేఖర్ | సైఫాబాద్ SHO | SB |
పి.లక్ష్మీకాంత్ రెడ్డి | అఫ్జల్ గంజ్ DI | సైఫాబాద్ SHO |
గంటా సంజీవ్ | తిరుమలగిరి DI | చాదర్ ఘాట్ DI |
ఎస్.విజయ్ | SB కామాటిపుర DI | బోరబండ SHO |
గడ్డపాటి నరేశ్ కుమార్ | SB సౌత్ ఈస్ట్ జోన్ | ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ |
టి.శ్రీనాథ్ రెడ్డి | ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ | SB సౌత్ ఈస్ట్ జోన్ |
శ్రీరామ్ సైదాబాబు | టాస్క్ ఫోర్స్ (అడ్మిన్) | సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ |
శ్రీమతి చిట్టి బుర్రా | సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ | టాస్క్ ఫోర్స్ (అడ్మిన్) |
ఎల్.భాస్కర్ రెడ్డి | సైబర్ క్రైమ్స్ | నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ |
కొన్ని సైదులు | నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ | సైబర్ క్రైమ్స్ |
మధుసూదన్ బాదె | ట్రాఫిక్(అడ్మిన్) | సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ |
యరగాని అజయ్ కుమార్ | సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ | ట్రాఫిక్(అడ్మిన్) |