సర్కారీ పాఠశాలలు, గురుకులాలను కలిపి సమీకృత విద్యాలయాలు(Integrated Schools)గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. BC, SC, ST, మైనారిటీ గురుకుల విద్యాలయాలను వేర్వేరు(Different) ప్రాంతాల్లో(Places) కాకుండా అన్నీ ఒకే చోట ఉండేలా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ క్యాంపస్ లకు శ్రీకారం చుట్టబోతున్నది.
సెగ్మెంట్ వైజ్ గా…
నియోజకవర్గానికో క్యాంపస్ నిర్మించనుండగా, పైలట్ ప్రాజెక్టుగా CM, డిప్యూటీ CM సెగ్మెంట్లయిన కొడంగల్, మధిరలో తొలుత నిర్మాణాలు చేపడతారు. ఆ తర్వాత దశల వారీగా అన్ని చోట్లా మొదలవుతాయి. దీనిపై సంబంధిత అధికారులతో CM రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, CS శాంతికుమారి రివ్యూ చేశారు. నిర్మాణాల ఆర్కిటెక్చర్స్ పై నమూనా(Designs)ల్ని పరిశీలించారు.
మినీ హబ్…
క్లాస్ రూమ్స్ సహా అన్ని సౌకర్యాలుండేలా మోడ్రన్ బిల్డింగ్స్ తో ఇంటర్నేషనల్ స్కూళ్లకు దీటుగా నిర్మించాలని ప్లాన్ తయారు చేశారు. స్థలాలను బట్టి డిజైన్స్ సిద్ధం చేసుకోవాలని CM ఆదేశించారు. ఒక్కో క్యాంపస్ ను 20-25 ఎకరాల్లో నిర్మించి మినీ ఎడ్యుకేషన్ హబ్ గా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో సర్కారు ఈ విధానానికి శ్రీకారం చుడుతున్నది. ఇంటిగ్రేషన్ వల్ల కుల, మత వివక్ష తొలగడంతోపాటు నిర్వహణ, పర్యవేక్షణ, అజమాయిషీ సమర్థంగా నిర్వహించవచ్చన్నది ప్రభుత్వ ఆలోచన.