రాష్ట్రంలో కొత్తగా స్థాపించబోయే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్(Integrated) స్కూళ్లకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 11న వీటికి శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో పాఠశాల నిర్మాణానికి రూ.25 కోట్లు ఖర్చు చేయనుండగా.. వివిధ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు. ఏడు నెలల్లో నిర్మాణాల్ని పూర్తి చేస్తామని డిప్యూటీ CM భట్టి విక్రమార్క తెలిపారు.
ఈ నియోజకవర్గాల్లో…
రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గాలైన(Constituencies) కొడంగల్, మధిరతోపాటు చాంద్రాయణగుట్ట, మంచిర్యాల, మంథని, హుస్నాబాద్, నల్గొండ, హుజూర్ నగర్, ములుగు, ఖమ్మం, తిరుమలగిరి, పాలేరు, వరంగల్, ఆందోల్, భూపాలపల్లి, స్టేషన్ ఘన్పూర్, తిరుమలగిరి, తుంగతుర్తి, కొల్లాపూర్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబోతున్నారు.