ఒక్క నిమిషం(One Minute) ఆలస్యం(Late)గా వచ్చినా పరీక్షలకు అనుమతించేది లేదంటూ తీసుకువచ్చిన నిబంధన(Rule)తో ప్రతి సంవత్సరం విద్యార్థులకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతోంది. ఏటా చాలా మంది ‘నిమిషం లేట్’ నిబంధనతోనే ఎగ్జామ్స్ మిస్సవుతున్నారు. కానీ దీనిపై ఇంటర్మీడియట్ బోర్డు పునరాలోచన చేసింది.
అన్ని వర్గాల నుంచి వస్తున్న సూచనలతో కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్నేళ్లుగా నిమిషం ఆలస్యం నిబంధనతో పడుతున్న ఇబ్బందుల్ని గమనించిన ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులు.. ఆ రూల్ ను ఎత్తివేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
నిమిషమే కాదు…
నిమిషమే కాదు… పరీక్షకు 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా విద్యార్థుల్ని అనుమతించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఉదయం తొమ్మిది గంటల లోపే పరీక్ష కేంద్రాల(Exam Centres)కు చేరుకోవాలని ఇప్పటిదాకా నిబంధన ఉండగా… ఇప్పుడు దాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. పొద్దున 9 గంటల తర్వాత ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన వారికి అనుమతించాలని డిసిషన్ తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులకు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.