ఇంటర్మీడియట్(Intermediate) అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్టియర్ పరీక్షల్లో 63.86 శాతంతో 1.62 లక్షల మంది ఉత్తీర్ణత(Pass) సాధించారు. ఒకేషనల్ ఫస్టియర్లో 53.24 శాతం మంది పాసయినట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇక సెకండియర్(Second Year) రిజల్ట్స్ లో 43.77 శాతం మంది.. ఒకేషనల్ సెకండియర్లో 51.12 శాతం మంది గట్టెక్కారు.