తెలంగాణలో పనిచేస్తున్న IPS అధికారుల్ని రిలీవ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. మాజీ DGP అంజనీకుమార్ తోపాటు అభిలాష బిస్త్, అభిషేక్ మహంతికి రిలీవ్ ఆర్డర్స్ వచ్చాయి. 1990 బ్యాచ్ కు చెందిన అంజనీకుమార్.. ప్రస్తుతం రోడ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ గా పనిచేస్తున్నారు. వీరు వెంటనే విధుల నుంచి రిలీవ్ అయి AP సర్కారుకు రిపోర్ట్ చేయాలని కేంద్ర హోం వ్యవహారాల శాఖ ఆదేశించింది. తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా ఉన్న అభిషేక్ బిస్త్.. కరీంనగర్ CP అయిన అభిషేక్ ను రిలీవ్ చేయాలని ఆదేశాల్లో ఉంది. అయితే కోడ్ కారణంగా అభిషేక్ రిలీవ్ పై ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాసింది.
రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఐదుగురు IAS, ముగ్గురు IPSలను APకి కేటాయించారు. మొన్నటివరకు వీరంతా తెలంగాణలో విధులు నిర్వహించగా, IASలు అమ్రపాలి, వాణిప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, ప్రశాంతి ఈ మధ్యనే అక్కడ రిపోర్ట్ చేశారు. ప్రస్తుతం రిలీవ్ ఆర్డర్స్ వచ్చిన ఈ ముగ్గురు సైతం వెంటనే APకి వెళ్లాలని కేంద్రం స్పష్టం చేసింది.