Published 19 Dec 2023
రాష్ట్రంలో సీనియర్లతోపాటు మొత్తం 20 మంది IPSలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రవిగుప్తాకు DGPగా పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా పనిచేసి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు బదిలీ అయిన సి.వి.ఆనంద్ కు అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ బాధ్యతలు కట్టబెట్టింది. ఇక మొన్నటివరకు DGPగా ఉన్న అంజనీకుమార్ ను రోడ్డు సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ గా నియమిస్తూ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అదనపు బాధ్యతల్ని కట్టబెట్టింది.
అధికారులు – కొత్త బాధ్యతలు
రవిగుప్తా – డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(DGP)
అంజనీకుమార్ – ఛైర్మన్, రోడ్డు భద్రతా విభాగం.. కమిషనర్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ(అదనపు బాధ్యతలు)
సి.వి.ఆనంద్ – డైరెక్టర్ జనరల్(DG), ACB
రాజీవ్ రతన్ – DG, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్
శిఖా గోయల్ – అదనపు DG, సీఐడీ
సౌమ్య మిశ్రా – DG, జైళ్ల శాఖ.. సైబర్ సెక్యూరిటీ బ్యూరో(అదనపు బాధ్యతలు)
అభిలాష బిస్త్ – డైరెక్టర్, రాష్ట్ర పోలీస్ అకాడెమీ, తెలంగాణ ట్రెయినింగ్ IG(అదనపు బాధ్యతలు)
మహేశ్ ఎం.భగవత్ – అదనపు DG, రైల్వే, రోడ్ సేఫ్టీ… ఆర్గనైజేషన్ అండ్ లీగల్(అదనపు బాధ్యతలు)
స్టీఫెన్ రవీంద్ర – IG, హోంగార్డ్స్… వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్(పూర్తి అదనపు బాధ్యతలు)
తరుణ్ జోషి – IG, మల్టీజోన్-2, హైదరాబాద్.. మల్టీజోన్-1 అదనపు బాధ్యతలు
వి.బి.కమలాసన్ రెడ్డి – DG, ప్రొహిబిషన్, ఎక్సైజ్
ఎ.ఆర్.శ్రీనివాస్ – డైరెక్టర్, అవినీతి నిరోధక శాఖ(ACB)
ఎస్.చంద్రశేఖర్ రెడ్డి – IG, పర్సనల్
కె.రమేశ్ నాయుడు – DIG, సీఐడీ
వి.సత్యనారాయణ – జాయింట్ కమిషనర్, CAR హెడ్ క్వార్టర్స్
శరత్ చంద్ర పవార్, DCP-సెంట్రల్ జోన్, హైదరాబాద్
అనిల్ కుమార్ – DG, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్
ఎం.రమేశ్ – MD, తెలంగాణ పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్
బి.సుమతి – DIG, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్
ఎం.శ్రీనివాసులు – అటాచ్డ్ DGP కార్యాలయం