
రాష్ట్రంలో కొద్దిసేపటి క్రితం భారీ స్థాయిలో ఐఏఎస్ లను బదిలీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు IPSలకు సైతం స్థాన చలనం కల్పించింది. మొత్తం 23 మందికి కొత్త బాధ్యతలు కట్టబెడుతూ CS శాంతికుమారి… ఆర్డర్స్ రిలీజ్ చేశారు. నిర్మల్, ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్ జిల్లాలకు కొత్త ఎస్పీలు వస్తున్నారు. రామగుండం, సిద్దిపేట కమిషనరేట్లకు కొత్త పోలీస్ కమిషనర్లు బాధ్యతలు తీసుకోనున్నారు.
అధికారులు – కొత్త బాధ్యతలు
వి.వి.శ్రీనివాసరావు – అడిషనల్ DGP, టెక్నికల్ సర్వీసెస్, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు(అదనపు బాధ్యతలు)
గజరావ్ భూపాల్ – DIG, కో-ఆర్డినేషన్, DGP ఆఫీస్
రెమా రాజేశ్వరి – DIG, మహిళా భద్రత విభాగం
ఎల్.ఎస్.చౌహాన్ – CP, రామగుండం
జోయల్ డేవిస్ – DIG, జోన్ VII(జోగులాంబ)
విష్ణు ఎస్.వారియర్ – అటాచ్డ్, DGP కార్యాలయం
పి.వి.పద్మజ, – DCP, మల్కాజిగిరి
జానకి షర్మిల – SP, నిర్మల్ జిల్లా
జానకి ధరావత్ – DCP, సౌత్ ఈస్ట్ జోన్, హైదరాబాద్
సునీల్ దత్ – కమిషనర్, ఖమ్మం
ఎస్.రాజేంద్రప్రసాద్ – SP, CID
డి.ఉదయ్ కుమార్ రెడ్డి – SP, ట్రాన్స్ కో
గౌస్ ఆలం – SP, ఆదిలాబాద్ జిల్లా
జి.వినీత్ – DCP, మాదాపూర్
పి.శబరీష్ – SP, ములుగు
నికిత పంత్ – DCP, లా అండ్ ఆర్డర్, మేడ్చల్ జోన్
బి.అనురాధ – CP, సిద్దిపేట
సి.హెచ్.ప్రవీణ్ కుమార్ – DCP, ఎల్బీనగర్ జోన్
బిరుదురాజు రోహిత్ రాజు – SP భద్రాద్రి కొత్తగూడెం
బి.బాలస్వామి – SP, మెదక్
అశోక్ కుమార్ – OSD, జయశంకర్ భూపాలపల్లి
ఆర్.వెంకటేశ్వర్లు – DCP, ట్రాఫిక్-III, హైదరాబాద్
సి.హెచ్.శ్రీనివాస్ – DCP, రాజేంద్రనగర్ జోన్