ఐదుగురు సీనియర్ IPS అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్స్ రిలీజ్ చేసింది. వీరంతా DG, IG, కమిషనర్ స్థాయి అధికారులుగా పనిచేస్తున్నారు. వెయిటింగ్ లో ఉన్న సౌమ్య మిశ్రా(1994 బ్యాచ్)ను పోలీస్ పర్సనల్ డిపార్ట్ మెంట్ అడిషనల్ డీజీగా(ADG)గా నియమించింది. ఇప్పటివరకు అక్కడ పనిచేస్తున్న వి.బి.కమలాసన్ రెడ్డి(2004 బ్యాచ్)ను డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ గా బదిలీ చేసింది. క్రైమ్స్, సిట్ లో ఉన్న A.R.శ్రీనివాస్(2004 బ్యాచ్)కు ACB డైరెక్టర్ గా బాధ్యతలు కట్టబెట్టింది.
వెయిటింగ్ లో ఉన్న అంబర్ కిషోర్ ఝా(2009 బ్యాచ్)ను హోంగార్డ్స్, టెక్నికల్ సర్వీసెస్ DIGగా… క్రైమ్స్ DCP పి.శబరీష్(2017 బ్యాచ్)ను మేడ్చల్ DCPగా బదిలీ చేస్తూ స్టేట్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఆర్డర్స్ ఇచ్చారు.