ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్(Job Calender) విడుదల చేసింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభ సమావేశాల్లో ప్రకటన చేశారు. ఇప్పటికే 13,505 ఉద్యోగ ఖాళీల భర్తీకి అనుమతిచ్చామన్న ఆయన.. పలు నోటిఫికేషన్ల వివరాల్ని తెలియజేశారు.
పోస్టుల సంఖ్యను తెలియజేయకపోవడంపై విపక్షం నుంచి విమర్శలు వచ్చాయి. దీనిపై డిప్యూటీ CM స్పందిస్తూ నోటిఫికేషన్లు ఇచ్చిన సమయంలోనే పోస్టుల సంఖ్య ప్రకటించాల్సి ఉంటుందని గుర్తు చేశారు.
రాబోయే నోటిఫికేషన్లు ఇలా…
సంవత్సరం | నోటిఫికేషన్ |
2024 అక్టోబరు | ట్రాన్స్ కో, డిస్కమ్ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీ |
2024 అక్టోబరు | AEEల పోస్టుల భర్తీ |
2024 అక్టోబరు | మరో గ్రూప్-1 |
2024 నవంబరు | టెట్ |
2025 ఫిబ్రవరి | డీఎస్సీ |
2025 ఫిబ్రవరి | ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ |
2025 ఏప్రిల్ | సబ్ ఇన్స్పెక్టర్(SI), ఆగస్టులో రాత పరీక్ష |
2025 ఏప్రిల్ | కానిస్టేబుళ్ల నియామకాలు |
2025 మే | గ్రూప్-2 నోటిఫికేషన్ |
2025 జులై | గ్రూప్-3 నోటిఫికేషన్ |
2025 జులై | సింగరేణిలో పోస్టుల భర్తీ |
2025 ఆగస్టు | కానిస్టేబుల్ రాత పరీక్ష |
2025 జూన్ | డిగ్రీ కాలేజీల్లో ఉద్యోగాల భర్తీ |
2025 జూన్ | గురుకులాల లెక్చరర్ పోస్టుల భర్తీ |
2025 అక్టోబరు | గ్రూప్-2 రాత పరీక్ష |
2025 నవంబరు | గ్రూప్-3 రాతపరీక్ష |