ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 9 సంఘాలు ప్రస్తుతం, మరో ఆరు రొటేషన్ పద్ధతిలో ఉంటాయి. ఈ కౌన్సిల్ లో 25 కంటే తక్కువ, 30 కన్నా ఎక్కువ మంది ఉండకూడదు. సగం మందిని సర్కారు, మరో సగం మందిని సంఘాలు నియమిస్తాయి. సమావేశాలు 4 నెల్లకోసారి లేదంటే ఛైర్మన్ అభీష్టం మేరకు నిర్వహించే వీలుంది. కానీ 14 రోజుల ముందు అన్ని సంఘాలకు సమాచారమివ్వాలి. ఉమ్మడి రాష్ట్రంలో గుర్తింపు పొందిన సంఘాల్ని 2014లో అధికారంలోకి వచ్చాక KCR రద్దు చేశారని ఉద్యోగ సంఘాల JAC గుర్తు చేసింది. మళ్లీ గుర్తింపునివ్వడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేసింది.