సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం నుంచి హామీ లభించడంతో జూనియర్ డాక్టర్లు సమ్మెకు తాత్కాలిక(Temporarly) విరామం ఇచ్చారు. DME(డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్)తోపాటు ఆరోగ్య శాఖ అధికారులతో అర్థరాత్రి వరకు చర్చలు జరిగాయి. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో బిల్డింగ్స్ నిర్మించాలని, కాకతీయ విశ్వవిద్యాలయంలో రోడ్లు బాగు చేయాలన్న ప్రధాన డిమాండ్లకు అధికారులు అంగీకరించారు.
గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో వసతి భవనాలపై ఈరోజు రెండు GOలు ఇస్తామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. ఆ మాట మేరకు సమ్మె(Strike)కు విరామమిచ్చిన జూడాలు.. ఈరోజు GOలు రిలీజ్ కాకపోతే మళ్లీ సమ్మె తప్పదని హెచ్చరించారు.
పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్, సర్కారీ దవాఖానాల్లో వసతులు, దాడుల నుంచి రక్షించడం, AP విద్యార్థులకు 15% రిజర్వేషన్ల రద్దు వంటి డిమాండ్లతో జూడాలు సమ్మె చేస్తున్నారు.