వరుసగా ఒకదాని వెంట ఒక రిజల్డ్స్ ను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) రిలీజ్ చేస్తున్నది. నిన్న గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు వస్తే ఇప్పుడు జూనియర్ లెక్చరర్(JL) ఫలితాల్ని విడుదల చేసింది. జేఎల్ కు సబ్జెక్టుల వారీగా జనరల్ ర్యాంకింగ్స్ లిస్టును విడుదల చేసిన TGPSC.. 1:2 నిష్పత్తిలో షార్ట్ లిస్టును త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది.
వికలాంగుల కోటాలో 1:5 నిష్పత్తిలో షార్ట్ లిస్ట్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్(CBRT) పద్ధతిలో పరీక్షల్ని 2023 సెప్టెంబరు, అక్టోబరులో నిర్వహించింది. ప్రభుత్వ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 1,392 పోస్టులకు TGPSC నోటిఫికేషన్ ఇచ్చింది.
మిగతా వివరాల్ని http://www.tspsc.gov.in వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. 11 రోజులపాటు 16 పరీక్షలు జరగ్గా గతానికి భిన్నంగా ఈసారి మల్టీజోన్-1లో 724, మల్టీజోన్-2లో 668 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. మిగతా వివరాల్ని http://www.tspsc.gov.in వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.