కాళేశ్వరం(Kaleswaram) ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై దాని బాధ్యతలు చూసిన ఇంజినీర్లపై విచారణ(Examine) జరుగుతున్నది. వీరంతా ఈరోజు జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఎదుట విచారణకు హాజరవుతున్నారు. మొత్తం 20 మంది ఇంజినీర్లు కమిషన్ అడిగే ప్రశ్నలకు వివరణ ఇస్తున్నారు.
బ్యారేజీ నిర్మాణం, నిర్వహణ, నాణ్యత ప్రమాణాలతోపాటు డ్యాం సేఫ్టీ(Dam Safety)కి సంబంధించిన అంశాలపై ఇంజినీర్లను జస్టిస్ పి.సి.ఘోష్ కమిటీ విచారిస్తున్నది. EE నుంచి SE దాకా కిందిస్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు అధికారులంతా ఈ విచారణకు అటెండ్ అవుతున్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో నిర్మాణమైన మేడిగడ్డ ప్రాజెక్టు అతి తక్కువ కాలంలోనే కుంగిపోయింది. దీనిపై కాంగ్రెస్ సర్కారు న్యాయ విచారణకు ఆదేశించి జస్టిస్ పి.సి.ఘోష్ ను ఇందుకు నియమించింది.