కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)ను మించిన మోసం మరొకటి లేదని, ప్రాజెక్టుల పేరిట రాష్ట్రాన్ని కొల్లగొట్టారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. దశాబ్దాల కాలం నుంచే కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రాజెక్టులు కట్టిందని, కానీ ఎక్కడా ఇలాంటి అవినీతి లేదని వివరించారు. కొల్లాపూర్ లో నిర్వహించిన సభకు ప్రియాంకగాంధీ స్థానంలో హాజరైన రాహుల్.. కేసీఆర్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో BRS-కాంగ్రెస్ మధ్య పెద్ద యుద్ధం జరుగుతున్నదని రాహుల్ అన్నారు.
ప్రజల తెలంగాణ-దొరల తెలంగాణ మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవని, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంతో ఉన్నది రాజకీయ అనుబంధం కాదు కుటుంబ బంధమని గుర్తు చేశారు. ధరణి కంప్యూటరైజేషన్ పేరిట భూములన్నింటిని లాగేసుకుని కుట్ర చేశారని, తద్వారా 20 లక్షల మంది రైతులు మోసపోయారన్నారు. ఢిల్లీలో CEC మీటింగ్ ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణ సభకు అటెండ్ అయ్యానని రాహుల్ తెలిపారు.