కాళేశ్వరం(Kaleswaram) ప్రాజెక్టుపై జస్టిస్ పి.సి.ఘోష్ ఇచ్చిన నివేదిక మీద అసెంబ్లీలో చర్చ ప్రారంభమైంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివేదికను ప్రవేశపెడుతూ అందులోని లోపాల్ని తెలియజేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు, పంప్ హౌజ్ ల నిర్మాణానికి రూ.21 వేలు ఖర్చు పెడితే, అవి 20 నెలలుగా నిరుపయోగంగా ఉన్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మొత్తం రూ.87,449 కోట్లు వెచ్చించారని, ఆ నిర్ణయాలన్నీ అప్పటి CM ఆదేశాల మేరకే జరిగాయని మంత్రి వివరించారు. మిగతావన్నీ కలిపి లక్ష కోట్లు ఖర్చు పెట్టినా లక్ష ఎకరాల కొత్త ఆయకట్టు కూడా రాలేదన్నారు.