క్రికెట్ లెజెండరీ కపిల్ దేవ్(Kapil Dev), బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గణ్.. CM రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి నివాసానికి విడివిడిగా వచ్చిన ఈ ఇద్దరూ.. తమ రంగాల్లోని అంశాలపై సమావేశమయ్యారు. హైదరాబాద్ లో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై CM-కపిల్ మధ్య చర్చ జరిగింది. తెలంగాణలో అంతర్జాతీయ ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు అజయ్ దేవ్ గణ్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) టెక్నాలజీతో కూడిన VFX, స్మార్ట్ స్టూడియోలు నిర్మించాలన్న ప్రతిపాదన ఉంది. ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ కు సైతం ఆలోచన చేస్తున్నారు.