మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR)కు హైకోర్టులో షాక్ తగిలింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యుత్ కమిషన్ ను సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ పై స్టే విధించాలంటూ KCR దాఖలు చేసిన పిటిషన్ మీద ప్రధాన న్యాయమూర్తి(CJ) బెంచ్ ఇంతకుముందే తీర్పును రిజర్వ్ చేసింది.
కేసీఆర్ లేవనెత్తిన అంశాలను ప్రస్తావించిన ఆయన తరఫు న్యాయవాదుల వాదనలతో కోర్టు విభేదించింది. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్కేంద్రాల నిర్మాణాలు, ఛత్తీస్ గఢ్ తో ఒప్పందాలపై ఈ కమిషన్ ఏర్పాటైంది. ప్రభుత్వం తరఫున వాదనల్ని అడ్వొకేట్ జనరల్(AG) వివరించారు.
కమిషన్ ఏర్పాటు చేస్తే తప్పేముందని, విచారణ జరిగి రిపోర్ట్ ఇచ్చాక అసెంబ్లీలో చర్చ జరుగుతుంది కదా అని ధర్మాసనం(Bench) అంటూ కేసును కొట్టివేసింది. ఇటీవల KCRకు విద్యుత్ కమిషన్ రెండు సార్లు నోటీసులు ఇస్తే.. అందుకు ప్రతిగా BRS చీఫ్ ఆరు పేజీల లెటర్ రాశారు.