50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ నేతలు చేతగాని దద్దమ్మల్లా ఉన్నారని.. సింగరేణి(Singareni)ని నిండా ముంచారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విమర్శించారు. తాము అధికారంలోకి రాకముందు 11 వేల కోట్లు ఉన్న టర్నోవర్ ను ఇప్పుడు 33 వేల కోట్లకు తీసుకువచ్చామని గుర్తు చేశారు. కొత్తగూడెంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో CM మాట్లాడారు. ఆనాడు కేంద్రం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాలు తెచ్చిన అప్పుల వల్లే సింగరేణిలో 49 శాతం కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాల్సి వస్తుందన్నారు. లేకుంటే వందకు వంద శాతం తెలంగాణకే దక్కేదన్నారు.
తమ పాలనలో ఏ ఒక్క సర్కారీ ఉద్యోగి నల్ల బ్యాడ్జి ధరించలేదని, అదే తమ ఘనత KCR అన్నారు.