ఆర్టీసీ అంశంపై మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్.. గవర్నర్ పై కామెంట్స్ చేశారు. ‘గవర్నర్ గారు ఎందుకు ఫైల్ ఉంచుకున్నారో తెలియదు.. పని లేని పనంతా పెట్టుకుని, 96 క్లారిఫికేషన్లడిగి.. వారికి జ్ఞానోదయమై.. గవర్నర్ గారు మధ్యాహ్నం పిలిచి సంతకం చేసి పంపించిండ్రు.. చాలా సంతోషం.. వారికి ధన్యవాదాలు చెప్తున్నా.. ఆర్టీసీ కార్మికుల పక్షాన.. నా పక్షాన’ అంటూ మాట్లాడారు. రవాణా సంస్థ సిబ్బందికి మంచి PRC ఇస్తామని అసెంబ్లీలో ప్రకటన చేశారు.
ఆస్తులపై కన్నేశామని దారుణంగా మాట్లాడారని, కానీ దాన్ని కాపాడటానికి ఎంతో కృషి చేశామన్నారు. సంస్థ సేవల్ని మరింత విస్తరించడానికి మరిన్ని డిపోలు అందుబాటులోకి తెస్తామన్నారు.