బతుకమ్మ చీరలు నచ్చకపోతే వాటిని తీసుకోకండి.. కానీ వాటి విషయంలో రాజకీయం మాత్రం చేయొద్దని ముఖ్యమంత్రి KCR అన్నారు. బతుకమ్మ చీరలు కేవలం చేనేత కార్మికులను ఆదుకునేందుకేనని, వారి ఆత్మహత్యలు చూసి చలించిపోయే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటున్న CM.. ఒకప్పుడు సిరిసిల్ల ప్రాంతాన్ని చూస్తే కన్నీళ్లొచ్చేవి అన్నారు.
విపక్ష పార్టీలతో పెద్ద ప్రమాదం పొంచి ఉందని, రైతుబంధు లేకుండా చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని విమర్శించారు. ధరణి ఉండాలో, రద్దు కావాలో అన్నది నిర్ణయించుకునేది ప్రజలే అని కామెంట్ చేశారు. ప్రస్తుతం 10 రాష్ట్రాలకు తెలంగాణ అన్నం పెడుతున్నదని గుర్తు చేశారు.