ముఖ్యమంత్రి కేసీఆర్.. పరాజయం పాలయ్యారు. ఆయన్ను ఓడిస్తూ BJP అభ్యర్థి వెంకటరమణారెడ్డి సంచలన విజయం సాధించారు. ఇద్దరు అగ్రశ్రేణి నేతలను పరాజయం పాలు చేసిన ఘనతను మూటగట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో CM కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రెండు చోట్ల నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. తన పాత స్థానం గజ్వేల్ తోపాటు కామారెడ్డిలోనూ బరిలోకి దిగారు. ముఖ్యమంత్రిని ఓడించేందుకంటూ PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం కామారెడ్డి నుంచి రెండో నామినేషన్ వేశారు. దీంతో ముక్కోణపు పోరు హోరాహోరీగా తప్పదని అంతా భావించారు. అనుకున్నట్లుగా తొలి ఐదు రౌండ్లలో ఆధిక్యం సాధించిన రేవంత్ రెడ్డి.. తర్వాతి రౌండ్లలో కమలం పార్టీ క్యాండిడేట్ వెంకటరమణారెడ్డి వెనక్కు నెడుతూ వచ్చారు. చివరకు కేసీఆర్, రేవంత్ రెడ్డిని ఓడిస్తూ సంచలన గెలుపును అందుకున్నారు.
మంచి మెజారిటీ
రమణారెడ్డి గెలవబోతున్నారంటూ ముందునుంచీ పెద్దయెత్తున ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే అంచనాల్ని నిజం చేస్తూ ఆయన కామారెడ్డిలో గెలుపు బావుటా ఎగురవేశారు. కేసీఆర్ పై వెంకటరమణారెడ్డి 5,156 ఓట్ల మెజారిటీ సాధించగా రేవంత్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు.