Published 09 Dec 2023
మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భారత్ రాష్ట్ర సమితి(BRS) శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. దీంతో ఈ మాజీ ముఖ్యమంత్రి ఇక ప్రధాన ప్రతిపక్ష నేత పాత్ర పోషించబోతున్నారు. తెలంగాణ భవన్ లో సమావేశమై BRS ఎమ్మెల్యేలు… తమ అధినేతనే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. నిన్న కింద పడటంతో తుంటి ఎముక విరిగి కేసీఆర్ కు ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు కొన్ని వారాల రెస్ట్ అవసరమని డాక్టర్లు స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో శాసససభాపక్ష నాయకుడిగా ఎవరిని ఎన్నుకుంటారన్నది ఇంట్రెస్టింగ్ మారింది.
కేసీఆర్ తర్వాత అత్యంత సీనియర్ కు ఆ పదవి అప్పగిస్తారా అన్న ఊహాగానాలు వెలువడ్డాయి. మరోవైపు మాజీ CM సైతం ఈ పదవికి సుముఖంగా ఉన్నారా అన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే అన్ని ఊహాగానాలకు తెరదించుతూ తమ అధినేతనే తమ పార్టీ పక్ష నేతగా ఎన్నుకున్నారు.