యాదాద్రి, భద్రాద్రి విద్యుత్కేంద్రాల నిర్మాణాలు.. ఛత్తీస్ గఢ్(Chattisgarh)తో కరెంటు ఒప్పందాలపై ఏర్పాటైన జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ కు.. మాజీ ముఖ్యమంత్రి KCR రిప్లై ఇచ్చారు. అన్ని రకాల నిబంధనలు, చట్టాలు పాటించామంటూ 6 పేజీల లెటర్ పంపించారు. విచారణ అనేది ఒక పవిత్రమైన బాధ్యత అన్న కేసీఆర్.. మీకు ఎంత చెప్పినా లాభం లేదనిపిస్తుందని అన్నారు.
ఎంతసేపూ పాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వాలని మాట్లాడుతున్నట్లుందని.. ఏదో నష్టం జరిగినట్లు, వాటిని లెక్కిస్తున్నట్లు మాట్లాడటం చూస్తే నిష్పాక్షికత ఏ మాత్రం కనిపించలేదని సదరు లెటర్లో కేసీఆర్ గుర్తు చేశారు. న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి తానేదో తప్పు చేసినట్లు మాట్లాడటం చూస్తేనే ఈ సర్కారుకు ఆయన అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరు తెలుస్తున్నదని అందులో రాశారు.