సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన కోసం ప్రగతి భవన్ నుంచి రెండు బస్సులతోపాటు 600 కార్ల భారీ కాన్వాయ్ బయల్దేరింది. సోలాపూర్, దారాశివ్ జిల్లాల్లో జరిపే టూర్ కు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లారు. మహారాష్ట్ర రాజకీయాలపై మెయిన్ ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్.. అక్కడి నేతల్ని పార్టీలోకి చేర్చుకుంటోంది. పండరీపూర్, తుల్జాపూర్ వెళ్లనున్న సీఎం.. ప్రఖ్యాత ఆలయాల్లో పూజలు చేస్తారు. సోమవారం సాయంత్రం షోలాపూర్ చేరుకుని ఆ రోజు అక్కడే బస చేస్తారు. మంగళవారం పండరీపూర్ వెళ్లి విఠోభారుక్మిణీ మందిర్ లో పూజలు చేసిన అనంతరం.. దారాశివ్ జిల్లాలోని శక్తిపీఠమైన తుల్జాభవాని అమ్మవారిని దర్శించుకుంటారు.
‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో మహారాష్ట్రలో BRS పెద్దయెత్తున ప్రచారం చేస్తోంది. ఈ పర్యటనలో తెలుగు ప్రజల్ని కలుసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సోలాపూర్ ప్రాంతంలో తెలంగాణకు చెందినవారు ఉపాధి పనులు చేసుకుంటూ కుటుంబాలతో పెద్దసంఖ్యలో నివసిస్తున్నారు. స్వరాష్ట్రానికి చెందిన వారిని అక్కడ కలుసుకోవడం వల్ల పార్టీకి అదనపు ప్రయోజనం ఉంటుందని భావించడంతో.. వివిధ వర్గాలకు చెందిన వారిని సీఎం మీట్ అయ్యే అవకాశం ఉంది.
Good move
janam sokkutho sokulu. Kootilo rayi teeyalenodu.. Yeti lo teesatada?