ఆత్మగౌరవాన్ని కించపరిచిన వారి చెంప చెళ్లుమనేలా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నదని, ఎకరం భూమి రూ.100 కోట్లకు పైగా అమ్ముడు పోవడమే అందుకు నిదర్శనమని CM కేసీఆర్ సగర్వంగా ప్రకటించారు. హైదరాబాద్ లో భూముల అమ్మకాలకు లభించిన విశేష స్పందన, భారీ ఆదాయంపై ఆయన స్పందించారు. దీన్నిబట్టి అయినా మనది విశ్వనగరమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. భాగ్యనగరంలో భూములకు పలికిన ధర.. రాష్ట్ర పరపతికి అద్దం పట్టిందని KCR ఆనందంతో ప్రకటించారు. ఎకరం రూ.100 కోట్లకు పైగా పలకడం హైదరాబాద్ విశ్వనగరంగా తయారయ్యేందుకు మనం చేసిన కృషికి ఫలితమన్నారు. దూసుకుపోతున్న ప్రగతికి, రాష్ట్ర పరపతికి ఈ అమ్మకాలు తీపి గుర్తుగా నిలిచాయన్న CM.. ప్రపంచస్థాయి కార్పొరేట్ కంపెనీలు పోటీ పడి మరీ ల్యాండ్స్ కొన్నాయని వివరించారు.
ల్యాండ్ రేట్స్ ఇంతగా రావడాన్ని ఫైనాన్షియల్ గానే కాకుండా డెవలప్ మెంట్ కోణంలోనూ చూడాలని అన్నారు. స్టేట్ గ్రోత్ ఇండెక్స్ అందనంత ఎత్తుకు దూసుకుపోతున్నదని, తెలంగాణ వస్తే భూముల రేట్లు పడిపోతాయని భయపెట్టారన్న మాటల్ని కేసీఆర్ మరోసారి గుర్తు చేశారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కు, హైదరాబాద్ అధికారులకు ఆయన విషెస్ చెప్పారు.