వినాయక చవితి వస్తుందంటే చాలు.. ఖైరతాబాద్ గణనాథుడి ఏర్పాట్ల గురించే చర్చ మొదలవుతుంది. అందరినీ ఆకర్షించేలా, భక్తిభావం వెల్లివిరిసేలా ఏటేటా వినూత్న రీతిలో అక్కడి గణనాథునికి రూపకల్పన చేస్తుంటారు. ఎత్తులో, పూజల్లో, నిమజ్జనంలో స్పెషల్ అట్రాక్షన్ గా ఉండేలా ప్రతిమను స్పెషల్ ఫోకస్ తో రూపొందిస్తారు. ఏటేటా కొత్త నమూనా(New Design)తో భక్తుల్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ఖైరతాబాద్ వినాయకుడిని ప్రజల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈసారి ప్రతిష్ఠించబోయే ఏకదంతుడికి నామకరణం చేశారు. ‘శ్రీదశ మహావిద్యా గణపతి’గా పేర్కొంటూ నిర్వాహకులు ఫొటోను విడుదల చేశారు.
69 సంవత్సరాల సెలబ్రేషన్స్(Celebrations)లో భాగంగా తాజాగా తయారవుతున్న మట్టి విగ్రహం 63 అడుగుల ఎత్తుతో ఉండబోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గణనాథుడి మందిరంలో కుడివైపున సరస్వతీదేవి, ఎడమ వైపున వరాహ దేవి విగ్రహాలు ఉంటాయి. ఇక గణేశుడికి కుడి వైపు గల మందిరంలో ఆసీనులైన శ్రీ పంచముఖ లక్ష్మీనారసింహస్వామి విగ్రహం… ఎడమ వైపు మందిరంలో శ్రీ వీరభద్రస్వామి కనిపిస్తారు.
Jai Ganesha…