కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ను BRS ప్రకటించింది. సిట్టింగ్ MLA కల్వకుంట్ల విద్యాసాగర్ రావు స్థానంలో ఆయన కుమారుడికి టికెట్ కేటాయించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి KCR తెలంగాణ భవన్ లో ప్రకటించారు. MLA విద్యాసాగర్ రావు కోరిక మేరకే ఈ డిసిషన్ తీసుకున్నట్లు కేసీఆర్ తెలిపారు. నియోజకవర్గంలో గత కొద్ది నెలలుగా విస్తృతంగా పర్యటిస్తున్న డా.సంజయ్.. వచ్చే ఎలక్షన్లలో పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారని CM స్పష్టం చేశారు.