పెద్దలను గౌరవించడమన్నది మన సంస్కారమని కానీ ఆ సంస్కారం నిజామాబాద్ MP ధర్మపురి అర్వింద్ కు లేదని మంత్రి KTR విమర్శించారు. ‘మతం గురించి మాట్లాడి రెచ్చగొట్టడం ఒక్కటే అర్వింద్ కు తెలుసు.. మాట్లాడినప్పుడల్లా హిందూ, ముస్లిం అంటూ రెచ్చగొడుతున్నారు.. అభివృద్ధి చేసే వారికి కులం, మతంతో ఏం సంబంధం’ అని KTR ఆయన తీరుపై మండిపడ్డారు. నిజామాబాద్ లో పర్యటించిన KTR వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు.
కొంతమందికి రాజకీయాలు, ఎన్నికలే ముఖ్యమని అలాంటి వారిని ప్రజలు గుర్తించాలంటూ ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చే నాయకులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని ప్రజలకు మంత్రి సూచించారు.