NDAలో చేరేందుకు కేసీఆర్ తనను కలిశారని, కేటీఆర్ కు ఆశీస్సులు అడిగారంటూ మోదీ చెప్పిన మాటలు పూర్తి అబద్ధాలని మంత్రి KTR మండిపడ్డారు. BJP అంటే బిగ్గెస్ట్ జుమ్లా పార్టీ అని, అబద్ధాల్లో మోదీకి ఆస్కార్ అవార్డ్ ఇవ్వాలన్నారు. ఆయన యాక్టింగ్, స్క్రిప్ట్ రైటింగ్ స్కిల్స్ కి అవార్డు రావాల్సిందేనన్నారు. ‘NDAతో కలిసేందుకు మాకు ఏమైనా పిచ్చి కుక్క కరిచిందా.. కర్ణాటకలో కాంగ్రెస్ ను బలపరిచారంటూ అబద్ధాలు చెప్పారు.. శివసేన, JD(U), తెలుగుదేశం, అకాలీదళ్ వంటి పార్టీలు NDAను విడిచిపెట్టాయి.. కమలం పార్టీలో చేరినవారంతా పునీతులవుతారా.. సుజనా చౌదరి, సీఎం రమేశ్, హిమంత బిశ్వశర్మపై గతంలో పెట్టిన ED, CBI కేసులు ఏమయ్యాయి.. కేసీఆర్ ఫైటర్.. ఆయన చీటర్ తో కలవడు.. మేం గుజరాత్ కు, ఢిల్లీకి గులాములం కాదు.. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పిచ్చిమాటలు మాట్లాడినా మీకు వచ్చేది గుండు సున్నానే’ అని కేటీఆర్ ఎదురుదాడి చేశారు.
NDA అనేది మునిగిపోయిన నావ అని అందులో ఎవరూ ఎక్కబోరు అని ఫైర్ అయ్యారు. చివరిదాకా మీతో కొట్లాడుతాం.. కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రి చేసేందుకు తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారంటూ KTR కౌంటర్ ఇచ్చారు.