
గవర్నర్ తిప్పి పంపిన మున్సిపల్, పంచాయతీరాజ్, ఎడ్యుకేషన్ బిల్లులను అసెంబ్లీలో పాస్ చేస్తామని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ రెండోసారి పాస్ చేసిన తర్వాత గవర్నర్ ఏం చేయలేరన్నారు. తిరుగులేని మెజారిటీతో గెలిచిన ప్రభుత్వాన్ని అపహాస్యం చేసే విధంగా తమిళిసై వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని కేంద్రం రాజకీయాలు చేస్తోందని, అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులను తిరిగి పంపడంపై చర్చించామని.. వాటిని రెండోసారి అసెంబ్లీలో పాస్ చేస్తామన్నారు. తర్వాత గవర్నర్ కు గత్యంతరం ఉండదని, ప్రభుత్వానిదే ఫైనల్ డిసిషన్ అన్నారు.
అనాథ పిల్లల సంరక్షణను ‘చిల్ట్రన్ ఆఫ్ ది స్టేట్’ గా గుర్తిస్తూ ఆర్ఫన్(Orphan) పాలసీని రూపొందించాలని శిశు సంక్షేమ శాఖను CM ఆదేశించారని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వమే తల్లిదండ్రులుగా మారి ఆశ్రయం కల్పించాలని నిర్ణయించిందని, వారు ఎదిగేదాకా అండగా ఉండాలని కేబినెట్ తీర్మానించిందన్నారు.