
ఆగస్టు 15 నుంచి అక్టోబరు లోపు లక్ష డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వబోతున్నామని మంత్రి KTR తెలిపారు. నియోజకవర్గానికి 4 వేల చొప్పున ఇస్తామని… తమ పాలనలో మంచినీరు, కరెంటుతోపాటు ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపామన్నారు. పనిచేసే ప్రభుత్వాలను ప్రజలు వదులుకోబోరన్న KTR… మెట్రో కోసం 415 కిలోమీటర్ల మేర ప్లాన్ తయారు చేశామన్నారు. KCR మూడోసారి గెలిచి దక్షిణ భారతదేశంలో హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆధ్వర్యంలోనే హైదరాబాద్ విశ్వనగరంగా తయారవుతుందని KTR అన్నారు.
గృహలక్ష్మీ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 3,000 కుటుంబాలకు రూ.3 లక్షల సాయం అందిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ ORR చుట్టూ 159 కిలోమీటర్ల మేర విస్తరిస్తామన్నారు.