అవయవ దానం(Organ Donation) విషయంలో తానే తొలి సంతకం చేస్తానని అసెంబ్లీ సాక్షిగా KTR అన్నారు. అవయవదానం బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా అవయవదానం బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. తాను దానానికి సిద్ధంగా ఉన్నానని, లక్షల మందికి ప్రతినిధులం కాబట్టి అందరికీ ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ విషయంలో నియోజకవర్గాల్లో అవగాహన తీసుకురావాలన్న మాజీ మంత్రి.. ఆలోచన గల సభ్యులు ముందుకు వస్తే అసెంబ్లీ ప్రాంగణంలోనే సంతకాల సేకరణ చేద్దామన్నారు. ఈ బిల్లును ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశపెట్టగా, అన్ని పక్షాలు అభినందించాయి.