రాష్ట్ర రాజధాని(Capital)లో చిన్న వర్షం పడ్డా రోడ్లు కుంటల్లా మారిపోతుంటాయి. కుంటలను కుదించి నిర్మాణాలు చేస్తే ఏమవుతుంది.. వాటిల్లోని నీరు రోడ్లపైకి వచ్చి చేరుతుంది. భాగ్యనగరం(Hyderabad)లో 61 శాతం మేర చెరువుల విస్తీర్ణం తగ్గిపోయినట్లు GHMC వద్ద లెక్కలున్నాయి. సాక్షాత్తూ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(NRSC) ఇచ్చిన రిపోర్టే ఈ విషయాల్ని చెబుతున్నాయి.
1979 నుంచి 2024 వరకు 61 శాతం మేర భూమిని చెరువులు కోల్పోయాయని NRSC తెలిపింది. 56 చెరువులు గతంలో 40.35 చదరపు కిలోమీటర్లలో ఉంటే అవిప్పుడు 16 చదరపు కిలోమీటర్ల పరిధికి చేరుకున్నాయి. నగరవ్యాప్తంగా 185 చెరువులకు గాను 40 పూర్తిగా ఎండిపోయాయి. శివరాంపల్లిలోని చారిత్రక బమ్ రకున్ ఉద్దౌలా చెరువును 1770లో తవ్వించారు. నాటి రాజుల తాగునీటి కోసం తవ్విన ఈ చెరువు 104 ఎకరాల్లో ఉండేది. కానీ ప్రస్తుతం 70% కోల్పోయి కుంటగా తయారైంది.