
బీసీ కులవృత్తిదారుల్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన లక్ష సాయం పథకానికి లక్షల్లో అప్లికేషన్లు వచ్చాయి. మొత్తం 5,28,862 అప్లికేషన్లు వచ్చాయని, వాటికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో పరిశీలన మొదలైనట్లు బీసీ సంక్షేమ శాఖ ప్రకటించింది. అప్లికేషన్ల సీరియల్ నంబర్ల ఆధారంగా స్క్రూటిని జరగనుంది. ప్రతి నెల 5వ తేదీ నాటికి వెరిఫికేషన్ పూర్తయిన అర్హులకు అదే నెల 15న రూ.లక్ష సాయం అందుతుందని తెలిపింది. లోకల్ ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఈ సాయం అందనుంది.
బీసీల్లోని వర్గాల వారీగా వచ్చిన అప్లికేషన్లు
BC-A – 2,66,001
BC-B – 1,85,136
BC-D – 65,310,
MBC – 12,415
Excellent, doing good