
Published 01 Dec 2023
రాష్ట్రవ్యాప్తంగా నిన్న 70.74 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో యాదాద్రి భువనగిరి జిల్లా రాష్ట్రంలోనే అత్యధికంగా 90.03 శాతం నమోదు అయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 86.69 శాతంతో మెదక్ రెండో స్థానంలో 85.74 శాతంతో జనగామ థర్డ్ ప్లేస్ లో నిలిచాయి. హైదరాబాద్ జిల్లాలో అత్యల్పంగా 46.56 శాతం మాత్రమే ఓట్లు పడ్డాయి. రంగారెడ్డి జిల్లాలో 59.94, మేడ్చల్ లో 56 శాతం మాత్రమే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జిల్లాల్లో ఇప్పటికీ 60 శాతం దాటకపోవడం గత ఎన్నికలనే తలపించింది. నియోజకవర్గాల పరంగా చూస్తే మునుగోడు 91.50 శాతం ఫస్ట్ ప్లేస్ లో నిలవగా.. 39.60 శాతంతో యాకుత్ పురా చివరి ప్లేస్ ను ఆక్రమించింది.
75 శాతం దాటినవి కొన్నే
మొత్తంగా చూస్తే 79 నియోజకవర్గాల్లో 75 శాతానికి పైగా పోలింగ్ పడినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి(CEO) వికాస్ రాజ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2018లో 73.37 పోలింగ్ నమోదైతే.. ఈసారి అంతకన్నా తక్కువగా 70.74 శాతం మాత్రమే ఓటింగ్ పడింది.