
Published 01 Dec 2023
తెలంగాణ ఎన్నికలపై వివిధ సంస్థలు ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించగా తాజాగా మరో సంస్థ సైతం రిజల్ట్స్ ప్రకటించింది. అధికార పగ్గాలు చేపట్టడంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి అడ్డంకులు లేవని స్పష్టం చేసింది. తెలంగాణలో జరిగిన పోలింగ్ పై ఇండియా టుడే నిర్వహించిన సర్వేకు సంబంధించిన ఫలితాలు వెల్లడయ్యాయి. హస్తం పార్టీ పాలనా పగ్గాలు చేపట్టేలా మెజారిటీ ఉంటుందని తెలియజేసింది. భారతీయ జనతాపార్టీ, మజ్లిస్ పార్టీకి ఇంచుమించు ఒకే మాదిరిగా సీట్లు రావచ్చని అంచనా వేసింది.
పార్టీలకు రానున్న సీట్లు ఇలా…
కాంగ్రెస్ 63-73
బీఆర్ఎస్ 34-44
బీజేపీ 4-8
ఎంఐఎం 4-8