
వర్షాల తీవ్రత దృష్ట్యా వ్యాధులు పెరిగే అవకాశం ఉన్నందున హెల్త్ డిపార్ట్ మెంట్ పూర్తిస్థాయిలో సర్వీసెస్ ఇవ్వాలని ప్రభుత్వం తెలియజేసింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే అన్ని చోట్లా హెల్త్ డిపార్ట్ మెంట్ సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించింది. ప్రస్తుత వాతావరణం దృష్ట్యా ఆరోగ్య సిబ్బందికి సెలవులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని విభాగాల ఉద్యోగులకు నోటీసుల్ని DH(డైరెక్టర్ ఆఫ్ హెల్త్) ఇష్యూ చేశారు.
ఇప్పటికే పర్మిషన్ ఇచ్చిన లీవ్స్ ను కూడా క్యాన్సిల్(Cancel) చేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారుల(DMHO)కు ఆదేశాలు పంపించారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో అలర్ట్ గా ఉండాలని స్పష్టం చేశారు.