రెండేళ్ల కాలానికి మద్యం దుకాణాల(Liquor Shops) ఏర్పాటు కోసం కొత్త లైసెన్సు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు గౌడ కులాలకు 15% రిజర్వేషన్లు ఉండగా ఈసారి SCలకు 10%, STలకు 5% కల్పించింది. దరఖాస్తు ఫీజును రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు చేసింది. 2025 డిసెంబరు 1 నుంచి 2027 నవంబరు 30 వరకు లైసెన్స్ పీరియడ్ ఉంటుంది. మొత్తం 2,620 దుకాణాల లైసెన్సుల గాను లైసెన్సు ఫీజుల్ని 6 కేటగిరీలుగా విభజించింది.
జనాభాను బట్టి కేటగిరీలు(2011 లెక్కల ప్రకారం) ఇలా…
5,000 వరకు – రూ.50 లక్షలు https://justpostnews.com
5 వేల నుంచి 50 వేల వరకు – రూ.55 లక్షలు
50 వేల నుంచి లక్ష వరకు – రూ.60 లక్షలు
లక్ష నుంచి 5 లక్షల వరకు – రూ.65 లక్షలు
5 లక్షల నుంచి 20 లక్షల దాకా – రూ.85 లక్షలు
20 లక్షలకు పైబడి – రూ.1.10 కోట్లు