ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఇరిగేషన్ అధికారులకు హైకోర్టులో ఊరట లభించింది. ప్రమోషన్లకు అనుమతిస్తూ ఆదేశాలు వెలువరించడంతో ఊపిరి పీల్చుకున్నట్లయింది. ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్(AE)లను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు(DEE)గా పదోన్నతి(Promotion) పొందడానికి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పచ్చజెండా ఊపింది. అయితే ఇందుకు 11 ఏళ్ల సర్వీసు కలిగిన అసిస్టెంట్ ఇంజినీర్లకు DEEగా ప్రమోషన్ కల్పించేందుకు సమ్మతించింది. ఇందుకు సంబంధించి గతేడాది రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 112ను సమర్థించింది.
జీవోను సవాల్ చేస్తూ AEEలు వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. నిబంధనలు సవరించే అధికారం ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేస్తూ పదోన్నతులు కల్పించవచ్చంటూ ఆదేశాలు జారీ చేసింది.