అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్ రిలీజ్ అయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఈ లిస్ట్ ను ప్రకటించారు. ఒకేసారి 115 అభ్యర్థులతో కూడిన లిస్టును వెల్లడించారు. మొత్తంగా పెద్దగా మార్పులు చేర్పులు లేవన్న కేసీఆర్… కేవలం ఏడుగురిని మాత్రమే మార్చినట్లు చెప్పారు. బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, వైరా, కోరుట్ల, ఉప్పల్ మారాయి. కోరుట్లలో విద్యాసాగర్ రావు కోరిక మేరకు ఆయన కుమారుడికి ఇస్తున్నామన్నారు. ఇక మిగతా ఆరు సిట్టింగ్ స్థానాల్లో టికెట్లను మార్చారు.
ముఖ్యమంత్రి KCR గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీకి దిగుతున్నారు. ఇక కొద్ది రోజులుగా స్థానం మారుతుందని ప్రచారం జరుగుతున్న ఖానాపూర్ లో.. రేఖా నాయక్ స్థానంలో భూక్యా రాథోడ్ జాన్సన్ నాయక్ పేరును ప్రకటించారు.