రాష్ట్ర సర్కారు ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన రుణమాఫీ తొలిదశలో ఇప్పటిదాకా 11.32 లక్షలకు పైగా కుటుంబాలకు చేరింది. మొత్తం 11.50 లక్షల కుటుంబాలు టార్గెట్ కాగా.. మరో 17,877 ఖాతాలకు నిధులు చేరలేదు. ఈ లెక్కల్ని వ్యవసాయశాఖే అధికారికంగా వెల్లడించింది.
లక్ష రూపాయల లోపు రుణాలకు సంబంధించి ఇప్పటివరకు రూ.6,014 కోట్లు జమ చేయగా… ప్రభుత్వం మాత్రం మొత్తం అకౌంట్లకు గాను రూ.6,098 కోట్లు విడుదల చేసింది. కొన్ని సాంకేతిక కారణాల(Technical Issues)తో మిగతా రైతులకు రూ.84.94 కోట్లు అందలేదు.
టెక్నికల్ ఇష్యూస్ తీరిపోగానే ఆ డబ్బు.. మిగిలిపోయిన అకౌంట్లలో జమవుతుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులు రిజర్వ్ బ్యాంక్(RBI) నిబంధనల మేరకు వెనక్కు తిరిగిరాగానే వాటిని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు.
వాణిజ్య బ్యాంకులకు అనుసంధానం చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు సంబంధించి 15,781 ఖాతాల తనిఖీ జరుగుతుండగా.. అది పూర్తవ్వగానే ఆ ఖాతాలకు సైతం రుణమాఫీ రిలీజ్ చేయనున్నారు.