రుణమాఫీ జరగట్లేదంటూ పలు ప్రాంతాల్లో రైతులు(Farmers) రోజూ రోడ్డెక్కుతున్నారు లేదంటే బ్యాంకుల వద్ద బైఠాయిస్తున్నారు. నిధులు విడుదల చేశామని డిప్యూటీ CM భట్టి విక్రమార్క చెబుతున్నారు. కానీ ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో చేరిందెంత.. బ్యాంకులకు సర్కారు విడుదల చేసిందెంత…!
దీనిపైనే భట్టి విక్రమార్క బ్యాంకర్లతో మరోసారి సమావేశమయ్యారు. లెక్కలు కాదు ఆత్మ ఉండాలంటూ ఒకింత సీరియస్ గానే మాట్లాడారు. వాస్తవానికి మూడు విడతల(Three Phases) కింద రూ.18,000 కోట్లు బ్యాంకులకు అందజేస్తే కర్షకులకు చేరింది మాత్రం రూ.7,500 కోట్లు మాత్రమే.
అంటే బ్యాంకులకు చేరినదాంట్లో కేవలం 41.66% మాత్రమే రైతుల అకౌంట్లో పడ్డాయి. మిగతా 58 శాతానికి పైగా నిధుల్ని పాత చెల్లింపుల కింద బ్యాంకులు ఒడిసిపట్టుకున్నట్లు డిప్యూటీ సీఎం మాటల్ని చూస్తే అర్థమవుతున్నది. దీన్నిబట్టి బ్యాంకులకు ఎంత చెప్పినా వాళ్లు ఏం చేయాలనుకుంటున్నారో అదే చేస్తారని మరోసారి తెలుసుకోవచ్చు.