ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రుణమాఫీ మార్గదర్శకాలు(Guidelines) విడుదలయ్యాయి. ఎలాంటి రైతులు అర్హులో(Beneficiaries) తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ను విడుదల చేసింది.
గైడ్ లైన్స్ ఇలా…
* భూమి ఉన్న ప్రతి కుటుంబానికి రూ.2 లక్షల వర్తింపు
* 2 లక్షలకు మించి రుణం ఉన్న రైతులు మొదట మొత్తం బ్యాంకులకు చెల్లించాలి. ఆ తర్వాత ఆ 2 లక్షల మొత్తాన్ని ఆయా ఖాతాల్లోకి బదిలీ చేస్తారు.
* స్వల్పకాలిక పంట రుణాలకే వర్తింపు
* రీ-షెడ్యూల్ చేసిన రుణాలకు మాఫీ వర్తించదు
* షెడ్యూల్డ్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, DCCBలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(PACS) రుణాలు మాఫీ
* SHG, JLG, RMG, LECS రుణాలకు మాఫీ ఉండదు
* సందేహాలు తీర్చేందుకు ప్రత్యేక డిపార్ట్మెంట్
* హైదరాబాద్ లోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(NIC) ద్వారా ఐటీ బాధ్యతలు
* వ్యవసాయశాఖ డైరెక్టర్-NIC ఆధ్వర్యంలో వెబ్ పోర్టల్, మండల హెల్ప్ సెంటర్లు
* 12-12-2018 తేదీ లేదా ఆ తర్వాత మంజూరైన రుణాలకు 09-12-2023 నాటికి ఉన్న బకాయిలకు వర్తింపు
* కుటుంబాన్ని లెక్కించేందుకు రేషన్ కార్డు ప్రామాణికం
* రూ.2 లక్షల మించి ఉంటే తొలుత బ్యాంకులకు ఇచ్చి ఆ తర్వాత మిగిలిన సొమ్ము నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ
* కుటుంబంలో ఎక్కువ మంది పేరున ఉంటే ముందుగా మహిళలకు ప్రాధాన్యం
* దరఖాస్తుల పరిశీలన 30 రోజుల్లో పూర్తి
* ప్రతి బ్యాంకులో నోడల్ అధికారి నియామకం.. పంటరుణాల డేటాకు డిజిటల్ సంతకం
* 2 లక్షల కన్నా ఎక్కువ రుణం ఉంటే మహిళల రుణాన్ని తొలుత మాఫీ చేసి మిగులు మొత్తాన్ని దామాషా పద్ధతిలో మిగతావారి రుణాల మాఫీ