
Published 30 Nov 2023
రాష్ట్రవ్యాప్తంగా మందకొడిగా పోలింగ్ కొనసాగుతున్నది. పల్లెటూళ్లలో మినహా పట్టణాలు, నగరాల్లో జనాలు బయటకు రావడం లేదు. ఉదయం 11 గంటల వరకు 11 జిల్లాల్లో 18% లోపే ఓటింగ్ నమోదైంది. ఇక హైదరాబాద్ జిల్లాలోని ఓటర్లు ఇంకా పోలింగ్ కేంద్రాలకే రావడం లేదు. హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లోనూ 12 శాతం లోపే ఇప్పటిదాకా నమోదైన పోలింగ్. వరంగల్(ఈస్ట్) నియోజకవర్గంలోనైతే హైదరాబాద్ పరిస్థితే కనపడుతున్నది. అక్కడ ఇప్పటివరకు కేవలం 13.50 శాతం మాత్రమే ఓట్లు పడ్డాయి. మారుమూల ప్రాంతమైన మంథని సెగ్మెంట్లో మాత్రం రాష్ట్రంలోనే అత్యధికంగా 31.60 శాతం పోలింగ్ జరిగింది.
నియోజకవర్గాల వారీగా ఇలా…
- వరంగల్(ఈస్ట్) 13.50
- కరీంనగర్ 14.60
- నిజామాబాద్ అర్బన్ 14.65
- ఆర్మూర్ 16.74
- నల్గొండ 17.60
- వరంగల్ వెస్ట్ 17.70
- షాద్ నగర్ 18.00
- కల్వకుర్తి 18.00
- చేవెళ్ల 18.00
- పినపాక 18.00